బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి నివాళులు అర్పించిన డిప్యూటీ సీఎం
05-04-2026 01:22 PM
హైదరాబాద్: ఖమ్మం పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. దేశ ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేయడంలో బాబు జగ్జీవన్ రామ్ పోషించిన పాత్ర చిరస్మరణీయమని, కేంద్ర మంత్రిగా, ఉప ప్రధానిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు నేటికీ పాలకులకు ఆదర్శప్రాయం నిలిచాయన్నారు. సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని, ఆ మహనీయుని ఆశయాలను ముందుకు తీసుకువెళ్లి, ఆయన చూపిన మార్గంలో నడవడమే మనంబాబు జగ్జీవన్ కు అర్పించే నిజమైన నివాళి అని తెలిపారు. ఆ స్ఫూర్తితోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా రంజక పాలనను అందిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి పేర్కొన్నారు.




