30 May, 2026 | 5:44 PM

మున్సిపల్ కార్పొరేషన్ లో సింగిల్ టెండర్లను వెంటనే రద్దు చేయాలి

30-05-2026 05:11 PM

ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో యుఐడిఎఫ్ నిధులతో చేపట్టిన టెండర్లకు సింగిల్ టెండర్లు మాత్రమే దాఖలు అయినందున వెంటనే వాటిని రద్దు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. టెండర్ల ప్రక్రియపై శనివారం బద్దం ఎల్లారెడ్డి భవన్ లో సిపిఐ నాయకులతో పంజాల శ్రీనివాస్ సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... మున్సిపల్ ఎన్నికలకు ముందు మంజూరైన 50 కోట్ల రూపాయల పనులకు టెండర్లు నిర్వహించిన వాటికి ఆమోదం లభించకుండా అడ్డుపడి కాంట్రాక్టర్లు తిరిగి అన్ని డివిజన్లకు ప్రాధాన్యమిస్తూ టెండర్లు నిర్వహిస్తే వాటిలో 87 టెండర్లలో 69 పనులకు సింగిల్ టెండర్ మాత్రమే దాఖలు కావడం చూస్తుంటే మున్సిపల్ కార్పొరేషన్ లో అవినీతి అక్రమాలు జరిగే అవకాశం ఉందని  ఆయన అనుమానం వ్యక్తం చేశారు.