5 April, 2026 | 7:51 PM

బాబు జగ్జీవన్ రామ్ సేవలు అజరామరం.. సర్పంచ్ రేణుక

05-04-2026 01:09 PM

తాండూరు,(విజయక్రాంతి): దేశ మాజీ ఉప ప్రధాని, స్వాతంత్ర సమరయోధులు స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు అజరాజమ మని వికారాబాద్ జిల్లా యాలాల మండలం దేవనూర్ గ్రామ సర్పంచ్ రేణుక కిషన్ రావు అన్నారు. ఆదివారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రావ్ 119వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమల వేసి ఘనంగా నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వాతంత్ర్య సమర యోధులు, రక్షణ, కార్మిక, రైల్వే, శాఖల కేంద్ర మంత్రిగా సేవలు అందించి ఉత్తమ పార్లమెంటియన్ అవార్డు తీసుకున్న, రాజ నీతిజ్ఞుడు బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శంకర్ నాయక్, తాండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ ఆశన్న, మెట్లి.కృష్ణ, ఎంఆర్పిఎస్ యాలాల అధ్యక్షులు మెట్లీ సూర్యప్రకాష్ మైముద్,మొగులాలి ,నరేష్,నరేందర్,శ్రవణ్,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.