19-04-2025 04:29:20 PM
దేవరకొండ: గుడ్‌ఫ్రైడే, ఈస్టర్ పండుగలను పురస్కరించుకొని శనివారం దేవరకొండ పట్టణంలో క్రైస్తవ సోదరులు నిర్వహించిన రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్(MLA Nenavath Balu Naik) జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రపంచానికి ప్రేమ తత్వం బోధించిన దయామయుడు, సిలువపై యేసుక్రీస్తు త్యాగం మహోన్నతమైనదని వారు అన్నారు.
కరుణామయుడి జీవితం మానవాళికి అందించిన సందేశమని, ప్రభు యేసు త్యాగాన్ని స్మరిస్తూ క్రైస్తవ సోదర, సోదరీమణులకు ఆధ్యాత్మిక శాంతి కలగాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ సిరాజ్ ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ముక్కామల్ల వెంకటయ్య గౌడ్, మాజీ జడ్పీటీసీ మారుపాకల అరుణ సురేష్ గౌడ్, మాజీ ఎంపీపీలు ఏడ్పుల గోవింద్ యాదవ్, బిక్కు నాయక్, జాన్, వేణు, కోనేరు ప్రభు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.