ట్రాక్టర్–బైక్ ఢీకొని ఒకరు మృతి
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): ట్రాక్టర్ బైక్ ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి మృతిచెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా వనపట్ల గేటు సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది. అంబడిపల్లి గ్రామానికి చెందిన అరిపల్లి శ్రీశైలం(25) తన సోదరుడు ఇరువురు స్వగ్రామం నుంచి ద్విచక్ర వాహనంపై హైదరాబాద్ వెళుతున్నారు.
ఈ క్రమంలో జాతీయ రహదారి వనపట్ల గేటు సమీపంలో ట్రాక్టర్ ఢీకొని శ్రీశైలం అక్కడక్కడే మృతి చెందాగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించినట్లు వైద్యులు తెలిపారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు వెంటనే మృతదేహాన్ని నాగర్ కర్నూల్ జనరల్ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.




