15 March, 2026 | 12:24 PM

శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ట

15-03-2026 10:58 AM

ముఖ్య అతిథిగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు

చర్ల,(విజయక్రాంతి): చర్ల మండలం లింగాపురం పాడు  గ్రామంలో మూడు రోజులుగా  నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట పండుగ అంగరంగ వైభవంగా వేద మంత్రోత్సవాల నడుము ఘనం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు హాజరై పట్టు వస్త్రాలను సమర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ నిర్మించడం ఎంతో సంతోషకరమన్నారు. మండలంలోని దాతల సహకారంతో ఆలయాన్ని నిర్మించడం, ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే గ్రామంలో  శ్రీ సీతారామచంద్ర స్వామి వారి   అనుగ్రహం గ్రామ ప్రజలపై ఉండాలని అన్నారు. భక్తుల కోసం అన్న ప్రసాదం వితరణ చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ, మండల ప్రజలు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.