మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై స్పందించిన టీపీసీసీ చీఫ్
15-03-2026 12:30 PM
హైదరాబాద్: మొయినాబాద్ డ్రగ్స్ కేసు(Moinabad Drugs Case)పై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(TPCC President Mahesh Kumar Goud) స్పందించారు. ఈగల్ బృందం కర్తవ్యాన్ని నెరవేరుస్తుందని, ఇందులో ఎలాంటి రాజకీయం లేదని ఆయన పేర్కొన్నారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బృందం సమాధానం చెప్పాలని పీసీసీ చీఫ్ డిమాండ్ చేశారు. కేటీఆర్, ఆయన అనుచరులు డ్రగ్స్ తీసుకుంటున్నట్లు అనుమానాలు ఉన్నాయని, అవసరమైతే కేటీఆర్ డక్స్ పరీక్షలకు సిద్ధం కావాలని, అసెంబ్లీ సమావేశాల సమయంలో ఎమ్మెల్యేలందరం పరీక్షలు చేసుకుందామన్నారు. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ గుర్తు చేశారు.




