29 June, 2026 | 2:01 AM

అభివృద్ధి, మౌలిక సదుపాయాలే లక్ష్యం

29-06-2026 12:00 AM
  1. రూ.97.92 లక్షలతో 57వ డివిజన్లో పనులకు శ్రీకారం
  2. గోకుల్నగర్ జంక్షన్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
  3. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

హనుమకొండ టౌన్, జూన్ 28 (విజయ క్రాంతి): వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని ప్రతి కాలనీని సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముం దుకు సాగుతోందని, అన్ని డివిజన్లలో ఏకకాలంలో అభివృద్ధి పనులు చేపడుతున్నా మని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం 57వ డివిజన్ పరిధిలోని గోకుల్నగర్, అశోక్ కాలనీ, వికాస్నగర్ ప్రాంతాల్లో రూ.97.92 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ గతంలో భారీ వర్షాలు కురిసి నప్పుడల్లా నగరం వరదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేదని గుర్తు చేశారు.

ప్రస్తు తం ముందస్తు ప్రణాళికతో వరద ముంపు ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థను బలోపేతం చేస్తూ, శాశ్వత పరిష్కారాల దిశగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. నగర ప్రజలు వర్షాకాలంలో ఇబ్బందులు పడకుండా అవసరమైన మౌలిక వసతులను వే గంగా పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. గోకుల్నగర్ జంక్ష న్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, రహదారి విస్తరణ, మౌలిక వసతుల మెరుగుదలకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఎ మ్మెల్యే వెల్లడించారు.

వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని ప్రతి కాలనీలో అంతర్గత రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్, ఇతర ప్రాథమిక సదుపాయాల కల్పనకు ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తూ పనులు చేపడుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు బంక సరళ సంపత్ యాదవ్, 57వ డివిజన్ అధ్యక్షులు బంక సతీష్, అభివృద్ధి కమిటీ గౌరవ అధ్యక్షులు వెంకట రాజారెడ్డి, అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మందల కృష్ణారెడ్డి, దేవాలయ కమిటీ అధ్యక్షులు చింత శ్రీనివాసరావు, జనరల్ సెక్రెటరీ బూర రామచంద ర్, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.