29 June, 2026 | 12:44 AM

మా రైతులకు నీళ్లివ్వండి

29-06-2026 12:00 AM
  1. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ 
  2. రైతులతో కలిసి వంటా వార్పు, మహాధర్నా 

కొత్తపల్లి, జూన్ 28 (విజయక్రాంతి): కరీంనగర్ నియోజకవర్గం కొత్తపల్లి మండ లంలోని రైతుల సాగు నీటి సమస్యను తీర్చడానికి మాజీ మంత్రి , ఎంఎల్‌ఏ గంగుల కమలాకర్ నాగుల మల్యాల శివారులోని ఆచంపల్లి వరద కాలువ తూము వద్ద  చుట్టు ప్రక్కన గ్రామాల రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆదివారం రోజున వంట వార్పు చేసి మహాధర్నా నిర్వహించారు.

ఈ సందర్బంగా ఎంఎల్‌ఏ గంగుల కమలాకర్ మాట్లాడుతూ నీళ్ళతో కళకళలాడే తెలంగాణా ఇప్పుడు ఎట్లవున్నదని, కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక రైతులకు కావాల్సిన సాగు నీరు, పెట్టుబడి సాయం కింద రైతుబందు, ఉచిత కరెంటు ఇచ్చి రైతును రాజుగా చూసుకున్నమని అన్నారు.

2018 సంవత్సరం రెండోసారి  ఎంఎల్‌ఏ గా గెలిచిన తరువాత కొత్తపల్లి మండలం లోని నాగుల మల్యాల, కొండాపూర్, బద్దిపెళ్లి, శ్రీరాములపల్లె గ్రామాలకు  సాగునీరు కోసం ఆచంపల్లి వద్ద వరద కాలువకు తూము నిర్మింపజేసి, కాలువ ద్వార చెరువులలో నీటిని నింపి రైతులకు అండగా నిలిచి వారి సాగు నీటి సమస్యను తీర్చమని పడియేండ్ల బిఆర్‌ఏస్ ప్రభుత్వం లో పంటలు సుభిక్షంగా పండ యని, ఇప్పుడు కరువు తో రైతులు తల్లడిల్లుతున్నరని తక్షణమే కాళేశ్వరం నుండి నీటిని కన్నెపెల్లి కి తరలించి కన్నెపల్లి నుండి మోటార్ల ద్వారా వరద కాలువకు నీటిని అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు.

కాళేశ్వరం నుండి రోజు 12,000 వేల క్యూసెక్కుల నీరు  రాజమండ్రి వెళ్ళి సముద్రంలో కలిసి వృథా అవుతున్నాయని, ఇప్పుడైనా ప్రభుత్వము స్పందించకుంటే పాదయాత్రగా కాళేశ్వరం వరకు వెళ్ళి ఆందోళనలు ఉదృతం చేస్తామని తెలిపారు. నేను రైతు బిడ్డనే, రైతుల గోస తెలిసిన నాయకునిగా రైతులకు నీళ్ళు అందే వరకు పోరాడతనని ప్రభుత్వన్ని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్, బీఆర్‌ఏస్ నాయకులు సర్దార్ రవీందర్ సింగ్,బీఆర్‌ఏస్ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్, 14వ డివిజన్ కార్పొరేటర్ గడ్డి ప్రదీప్,మాజీ ఎంపిపి పిల్లి శ్రీలత-మహేశ్, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ రెడ్డవేణి మధు, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉప్పు రాజశేఖర్, మాజీ కొత్తపల్లి  మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు,మాజీ గ్రంథాలయ చైర్మన్లు ఏనుగు రవీందర్ రెడ్డి, పొన్నం అనిల్,సర్పంచులు లక్కకుల చంద్రకళ-మోహన్ రావు, పెంచాల ఆంజనేయులు, తాండ్ర శ్రీనివాస్, ఉప సర్పంచులు  వైద తిరుపతి, బూస కరుణాకర్,నాయకులు కసారపు శ్రీనివాస్, రుద్ర రాధ,శ్రీరామ్ సురేందర్, జింక సంపత్, ఎల్డంది ప్రకాష్, బోనాల చంద్రయ్య, బోనాల నర్సయ్య,ఉప్పు శేఖర్, పెరుమండ్ల కమల్,నరేందర్, సోమిరెడ్డి లక్ష్మారెడ్డి, రైతులు పాల్గొన్నారు.