27 August, 2026 | 4:40 PM

అభివృద్ధి సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

27-08-2026 03:36 PM

కేసముద్రం (విజయక్రాంతి): ప్రజా సంక్షేమం, అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, ఇచ్చిన హామీ మేరకు నారాయణపురం గ్రామ రైతుల సమస్యలను పరిష్కరించి పట్టా పాస్ పుస్తకాలు అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దేనని కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి(Sanjeeva Reddy) అన్నారు.

సోమవారం కేసముద్రం పట్టణ మున్సిపాలిటీ నూతన భవన నిర్మాణం, నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభంతో పాటు నారాయణపురం గ్రామ రైతులకు నూతనంగా పట్టా పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivasa Reddy), రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి(Vem Narender Reddy), మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్(Balaram Naik), ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్(Bhukya Murali Naik), ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజా ప్రతినిధులు వస్తున్న నేపథ్యంలో మార్కెట్ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సోమవారం నిర్వహించనున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేసముద్రం మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.