27 August, 2026 | 5:34 PM

డిజిటల్ క్రాప్ సర్వేతో పంటల వివరాల నమోదు

27-08-2026 04:30 PM

బెజ్జంకి, ఆగస్టు 27: వానాకాలం–2026 పంటల సాగు వివరాల నమోదు ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిజిటల్ క్రాప్ సర్వే (DCS) మొబైల్ యాప్ ద్వారా ప్రారంభించినట్లు బెజ్జంకి మండల వ్యవసాయ అధికారి సంతోష్ తెలిపారు. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక వాలంటీర్‌ను కేటాయించి, క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి వివరాలు, ఫొటోలను యాప్‌లో నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు.

రైతులు గ్రామ వాలంటీర్ సమాచారం ఇచ్చిన సమయంలో అందుబాటులో ఉండి పంట వివరాలను తెలియజేస్తూ సర్వేకు సహకరించాలని కోరారు. డిజిటల్ క్రాప్ సర్వేలో నమోదైన వివరాల ఆధారంగానే పంట ఉత్పత్తుల కొనుగోలు ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు. రైతులకు ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత క్లస్టర్ ఏఈఓను సంప్రదించాలని సూచించారు.