08-12-2025 12:18:33 AM
ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం
వనపర్తి, డిసెంబర్ 7 ( విజయక్రాంతి ) : మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పెద్దమందడి మండలంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. మణిగిల్ల, జగత్ పల్లి ,పెద్దమందడి, మోజెర్ల ,వెల్టూర్ ,అల్వాల, అమ్మపల్లి, స్కూల్ తండా, వీరాయపల్లి, చీకరు చెట్టు తండా, చిన్నమందడి, దొడగుంటపల్లి పామిరెడ్డిపల్లి, గ్రామాల్లో ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం చేపట్టారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయా గ్రామాలకు వచ్చిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు డప్పు వాయిద్యాలతో, నృత్యాలు చేస్తూ మంగళ హారతులతో ఘనంగా స్వాగతం పలికారు. ఆయా గ్రామాలలో కాంగ్రెస్ మద్దతుతో బరిలో నిలిచిన అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే గ్రామ ప్రజలకు సూచించారు. మరో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ నే అధికారంలో ఉంటుందని ఇప్పుడు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తేనే గ్రామాలలో పూర్తిస్థాయి అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ప్రతిపక్షాల అభ్యర్థులకు మీ అమూల్యమైన ఓటు వేసిన నిరుపయోగా అవుతుందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మాత్రమే మీ విలువైన ఓటును వేయాలని ఎమ్మెల్యే సూచించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక గ్రామాలలో ఇందిరమ్మ పాలన కొనసాగుతుందన్నారు.
ఎమ్మెల్యేగా నేను ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎంపీగా మల్లు రవి మరో 10 ఏళ్ళు ఉంటామని ప్రస్తుతం గ్రామ సర్పంచులు ఇతర పార్టీల వాళ్లు గెలిస్తే ఆ గ్రామాలకు ఒరిగేదేమీ లేదని అభివృద్ధి ఆగిపోతుంది తప్ప ఉపయోగముండదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసిలు వెంకటస్వామి వేణుగోపాలకృష్ణ, మాజీ సింగిల్ విండో అధ్యక్షులు సత్య రెడ్డి, ఆయా గ్రామాల మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్దలు మహిళలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు