calender_icon.png 10 December, 2025 | 7:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం

08-12-2025 12:19:54 AM

  1. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి 

డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్

మహబూబ్ నగర్ టౌన్, డిసెంబర్ 7: గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్లపాలనపై ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే అమలు చేయలేదన్నారు. జనరల్ సీట్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. పార్టీ పరంగా జనరల్ సీట్లలో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో మంచి ఆదరణ ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ప్రజలు మద్దతుగా నిలవాలని కోరారు.

పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి గ్రామాల అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గ్రామాలను మాడల్ విలేజ్ గా తయారుచేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రానున్న మూడేళ్లలో ప్రజా సంక్షేమ కోసం మరిన్ని పథకాలు అమలు చేస్తామని తెలిపారు. బూత్, గ్రామ, మండల, పట్టణస్థాయిల్లో పార్టీ కమిటీలను పూర్తిచేస్తామన్నారు. జిల్లా పార్టీని మరింత బలోపేతం చేస్తామని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు గ్రామాల్లోకి వెళ్లి ప్రజలకు పథకాలు వివరించి పార్టీ అభ్యర్థుల గెలుపులో కీలకపాత్ర పోషించాలని కోరారు. సర్పంచ్ ఎన్నికల్లో వేలంపాటలు జరుగుతున్నాయనేది కేవలం ఊహజనితమని, ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరుగుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అఖ్తర్, నాయకులు చంద్రకుమార్ గౌడ్, సీజే బెనహర్, వసంత, లింగం నాయక్ , బెక్కరి మధుసూదన్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, ఫయాజ్, అజ్మత్ అలీ, ఆవేజ్, రాములు యాదవ్ పాల్గొన్నారు.