calender_icon.png 10 December, 2025 | 9:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీతి, నిజాయితీకి లోకారెడ్డి ఆదర్శం

08-12-2025 12:17:02 AM

  1. నిజాయితీకే పట్టం కట్టండి 

తాడిపర్తి గ్రామ సర్పంచ్గా గెలిపిస్తే స్వచ్ఛమైన తాగునీరు అందిస్తా 

విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తాం 

గ్రామంలో ఉండి సేవ చేసుకుంటా 

కాంగ్రెస్ సర్పంచ్ హ్యాండ్ బ్యాగ్ గుర్తుకు ఓటు వేసి గెలిపించండి

గోపాలపేట్, డిసెంబర్7: తాడిపర్తి గ్రామంలో నీతి నిజాయితీకి ఆదర్శంగా నిలిచిన పేరి లోకా రెడ్డి హ్యాండ్ బ్యాగ్ గుర్తుకు ఓటు వేసి  గెలిపించాలని ప్రజలను కోరారు. వనపర్తి జిల్లా గోపాలపేట మండలం తాడిపర్తి గ్రామంలో ఆదివారం ప్రచారంలో పాల్గొన్న పేరి  లోకా రెడ్డి ప్రజలతో మాట్లాడారు. గత పాలనలో తాడిపర్తి గ్రామ ప్రజలు ఎన్నో సమస్యలకు గురయ్యారని అన్నారు. నిజాయితీగా ఉన్న వారిని తప్పుదోవ పట్టించి ఎన్నో సమస్యల పాలైనట్లు తెలిపారు.

ప్రజలంతా దీవించి మీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన లోకా రెడ్డిని గెలిపించాలని తెలిపారు. తాను గెలిచిన వెంటనే గ్రామాన్ని సస్యశ్యామలంగా మారుస్తానన్నారు. తాను ఎక్కడికి వెళ్ళకుండా మీ కనసంధానములో ఉంటూ పిలిస్తే పలుకుతానని అన్నారు. గతంలో రెండు పర్యాయాలు సర్పంచ్గా పాలించి మంచి పేరు మన్ననలు పొందినానని తెలిపారు. మీ అన్నలా మీ తోబుట్టువుల దీవించి సర్పంచ్ గుర్తు హ్యాండ్ బ్యాగు కు ఓటు వేయాలని ప్రజలను అర్థించారు.

తాను సర్పంచ్‌గా గెలిచిన వెంటనే విద్యార్థుల కోసం ఎనిమిదవ తరగతి వరకు ఉన్న పాఠశాలను పదవ తరగతికి పెంచే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఏర్పాటు చేస్తానని చెప్పారు. అంతేకాకుండా అక్కడక్కడ మురుగు కాలువలు లేక రోడ్ల వెంబడి పారుతూ కంప కొడుతున్నాయని వాటి మరమ్మత్తులు తో పాటు మురుగునీరు బయటకు వెళ్లడానికి పైప్ లైన్లు ఏర్పాటు చేస్తానని చెప్పారు.

పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మన ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యేనని గ్రామ అభివృద్ధి కోసం పాటుపడతానని చెప్పారు. గ్రామం అండాకారంలో ఉందని తాను సర్పంచి సర్పంచ్ గా గెలిచిన వెంటనే గ్రామాన్ని వెలుగులోకి తీసుకొస్తానని ప్రజలకు తెలిపారు. ప్రతి ఒక్కరు కూడా హ్యాండ్ బ్యాగ్ గుర్తుకు ఓటు వేసి గెలిపించి విజయం సాధించేలా దీవించాలని ప్రతి మనిషిని పేరుపేరునా కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఆయన వెంట ఉన్నారు.