22 August, 2026 | 10:21 PM

గురుకుల విద్యా సంస్థల అభివృద్ధికి నా శాయశక్తుల కృషి చేస్తా

22-08-2026 09:37 PM

మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి

ఘట్ కేసర్,(విజయక్రాంతి): ఘట్ కేసర్ గురుకుల్ విద్యాసంస్థల పూర్వ వైభవ అభివృద్ధికి నా శాయశక్తుల కృషి చేస్తానని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. ఘట్ కేసర్ పట్టణంలోని గురుకుల్ కళాశాలలో శనివారం గురుకుల్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో దాతల సహకారంతో విద్యార్థిని, విద్యార్థులకు నిర్మించిన వాష్ రూమ్ లను పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి, మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి విచ్చేసి ఈ సందర్భంగా మాట్లాడుతూ... గురుకుల్ జూనియర్ కాలేజీ ను కేజీ టూ పీజీ వరకు ఏర్పాటు చేయడానికి నా శాయశక్తుల కృషి చేస్తానని తెలిపారు.

ప్రస్తుతం జూనియర్ కళాశాలలో అధ్యాపకుల కొరత వలన అనుకున్నంత విద్యను అభ్యసించకపోవడం ఇట్టి పరిస్థితిని త్వరలో ముఖ్యమంత్రితో కలిసి ఇట్టి విషయాన్ని చెప్పి ఈ గురుకుల కళాశాలను ఎండోమెంట్ నుండి ప్రభుత్వం స్వాధీనం తీసుకునేటట్టు మాట్లాడి చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి అధికార కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు రాకపోవడం వారికి అభివృద్ధిపై ఎంత ధ్యాస ఉందోనని 

చర్చన్యాంశంగా  మారింది. అదేవిధంగా లాల్ బహదూర్ స్మారక  యువజన సంఘం వారు గురుకుల్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఇంటర్ మొదటి సంవత్సరం లో ఉత్తీర్ణులైన వారిలో ఎక్కువ మార్కులు వచ్చిన వారికి రూ. 5వేలు నగదు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులకు సహకరించిన దాతలను శాలువాలతో సత్కరించారు.

ఈకార్యక్రమంలో మాజీ ఎంపీపీలు  బండారి శ్రీనివాస్ గౌడ్, ఏనుగు సుదర్శన్ రెడ్డి, గురుకుల్ పరిరక్షణ సమితి సభ్యులు, మాజీ జడ్పిటిసి సింగిరెడ్డి రామిరెడ్డి, జేఏసీ కన్వీనర్ మారం లక్ష్మారెడ్డి, టిడిపి జిల్లా నాయకులు వేముల సంజీవగౌడ్, బిజెపి  అధ్యక్షులు కొమ్మిడి మహిపాల్ రెడ్డి, లాల్ బహదూర్ స్మారక యువజన సంఘం అధ్యక్షులు బ్రహ్మం,  గురుకుల్ ప్రిన్సిపాల్ నారాయణ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థిని, విద్యార్థులు గురుకుల్ పూర్వ విద్యార్థులు  పాల్గొన్నారు.