22 August, 2026 | 10:58 PM

మంత్రి కొండ సురేఖ పదవికి రాజీనామా చేయాలి

22-08-2026 10:14 PM

* రాష్ట్ర మంత్రి  అడ్లూరి  లక్ష్మణ్ కుమార్

ఉట్నూర్,(విజయక్రాంతి): రాష్ట్ర అడవి శాఖ మంత్రి  కొండా సురేఖ  కూతురు కొండ సుస్మిత  రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి తోపాటు  కాంగ్రెస్ పార్టీపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు  పూర్తి బాధ్యత మంత్రి సురేఖ పై ఉందని, వెంటనే ఆమె పదవికి రాజీనామా చేసి  సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణ కోరాలని  రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి  మంత్రి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు.

శనివారం ఉట్నూర్ మండలంలో పర్యటించిన సందర్భంగా  ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రజా పాలన ప్రభుత్వంలో   ప్రజా సంక్షేమమే ధ్యేయంగా  కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని గుర్తు చేశారు. 2029లో  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తిరిగి వస్తుందని  ఈ సందర్భంగా గుర్తు చేశారు. డిసెంబర్ 30 లోగా గిరిజన సంక్షేమ శాఖలో  మార్పులు తీసుకువస్తామని  అన్నారు. ఆయనతోపాటు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఎమ్మెల్సీ దండే విట్టల్  పాల్గొన్నారు.