23 August, 2026 | 12:46 AM

గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలిగా నివేదిత ఏడాది పూర్తి.

22-08-2026 10:16 PM

దేశాయిపేట జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థుల ఘన సన్మానం

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని దేశాయిపేట గ్రామంలోని జడ్పీహెచ్‌ఎస్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నివేదిత గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలిగా బాధ్యతలు చేపట్టి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు నివేదితను ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల భవిష్యత్తుకు ఆమె అందిస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.