22 August, 2026 | 10:55 PM

ప్రిన్సిపాల్‌కు కృతజ్ఞతలు తెలిపిన లైబ్రేరియన్

22-08-2026 09:51 PM

రామారెడ్డి,(విజయక్రాంతి): పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న పాఠకుల దృష్ట్యా రామారెడ్డి శాఖ గ్రంథాలయానికి పాఠకులు కోరిన మేరకు ఇంటర్మీడియట్‌ ఇంగ్లిష్‌, తెలుగు పుస్తకాలను ఇంటర్మీడియట్‌ ప్రిన్సిపాల్‌ నారాయణ అందజేసినట్లు లైబ్రేరియన్‌ మద్దుల రాములు తెలిపారు. పోటీ పరీక్షలతో పాటు ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ఈ పుస్తకాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. పాఠకుల అవసరాలకు అనుగుణంగా మరిన్ని పుస్తకాలను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు ఉపయోగపడే విధంగా గ్రంథాలయాన్ని అభివృద్ధి చేయడంలో ప్రిన్సిపాల్‌ అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు.