16 April, 2026 | 2:07 AM

ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులు

16-04-2026 12:00 AM

చైర్‌పర్సన్ సోనియా దర్శన్

మొయినాబాద్ ఏప్రిల్ 15(విజయ క్రాంతి): మున్సిపాలిటీ పరిధిలో ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని చైర్పర్సన్ సోనియా దర్శన్ తెలిపారు. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎనికేపల్లి 9వ వార్డులో రూ.15 లక్షల నిధులతో చేపడుతున్న సీసీ రోడ్డు పనులను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో అండర్గ్రౌండ్ డ్రైనేజీ మరియు సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు.

ప్రతి వార్డులో సమానంగా అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గరుగు రాజు, కౌన్సిలర్లు ముదిగొండ ప్రభాకర్, మహేష్, వార్డ్ ఆఫీసర్ వెంకటేష్, నాయకులు షాబాద్ దర్శన్, సాయికిరణ్ గౌడ్, రఘు, రమేష్, రాజేష్, బాల్రాజ్, బిక్షపతి, శ్రీశైలం, యాదగిరి, గోపాల్ రెడ్డి, శేఖర్ రెడ్డి, జంగయ్య, డి. శ్రీనివాస్, సురేష్, మహిపాల్ రెడ్డి, వెంకటేష్ గౌడ్, మల్లేష్, సత్యనారాయణ గౌడ్, మహేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.