16 March, 2026 | 2:05 AM

మల్లన్న క్షేత్రానికి పోటెత్తిన భక్తులు

16-03-2026 12:38 AM
  1. అగ్నిగుండాలకు ఏర్పాట్లు పూర్తి
  2. మల్లన్నను దర్శించుకున్న మంత్రి కొండా సురేఖ

కొమురవెల్లి, మార్చి 15: కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో చివరి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. రాజగోపురం, ప్రసాదాల కౌంటర్, గంగిరేని చెట్టు తదితర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. స్వామి వారికి పట్నాలు వేసి బోనాలు చెల్లించి, భక్తితో వేడుకున్నారు. గుట్టపై ఎన్నున్నా ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించి, ఓడిబియాలు పోసి, ’మమ్ము కరుణించమని భక్తిశ్రద్ధలతో తల్లిని వేడుకున్నారు.

స్వామివారి ధర్మ దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టిం ది. కాగా బ్రహ్మోత్సవాలలో చివరి తంతువైన అగ్నిగుండాల నిర్వహణకు ఏర్పా ట్లు పూర్తి చేశారు. ప్రవేశ కార్యక్రమానికి ఆదివారం అర్ధరాత్రి దాటాక అర్చకులు స్వీకారం చుడతారు. కాగా మల్లికార్జున స్వామిని దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు