మల్లిక ఆస్ప త్రిలో ఓపెన్ వెయిట్‌బేరింగ్
రాష్ట్రంలోనే తొలి ఏఐ ఎంఆర్‌ఐ యంత్రం
హైదరాబాద్, మార్చి 15 (విజయక్రాంతి) : కేపీహెచ్‌బీలోని మల్లిక ఆసుపత్రిలో రాష్ట్రంలోనే తొలి ఏఐ ఆధారిత అడ్వాన్స్‌డ్ జీస్కాన్ ఓపెన్ వెయిట్‌బేరింగ్ ఎంఆర్‌ఐ యంత్రాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ ఆధునిక సాంకేతికతతో వెన్నెముక, కీళ్ల సమస్యలను మరింత ఖచ్చితంగా గుర్తించవచ్చని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. జీస్కాన్ ఓపెన్ ఎం ఆర్‌ఐ ద్వారా నిలబడిన, కూర్చున్న, వంగిన స్థితుల్లో కూడా స్కానింగ్ చేసి వెన్నెముక, కీళ్ల ప్రవర్తనను పరిశీలించవచ్చు. దీంతో వ్యాధి నిర్ధారణ మరింత ఖచ్చితంగా జరిగే అవకా శం ఉందని తెలిపారు.
ఈ వ్యవస్థలో వెయిట్‌బేరింగ్ ఎంఆర్‌ఐ, డైనమిక్ పొజిషనల్ స్కానింగ్, ఓపెన్ ఎంఆర్‌ఐ నిర్మాణం, అధునాతన సాఫ్ట్వేర్ ద్వారా బయోమెకానికల్ విశ్లేషణ వంటి సౌకర్యాలు ఉన్నాయని వెల్లడించారు. ప్రముఖ స్పున్ శస్త్రచికిత్స నిపుణు డు డా. జె. నరేష్ బాబు ఆధ్వర్యంలోని స్పున్ సెంటర్లో సంక్లిష్ట వెన్నెముక వ్యాధులకు సమ గ్ర చికిత్స అందిస్తున్నారు. డా.రంగనాథ్ నేతృత్వంలో నెఫ్రాలజీ సేవలు, డా.రాధిక ఆ ధ్వర్యంలో మహిళల ఆరోగ్య సేవలు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు.




