16 March, 2026 | 2:05 AM

బీజేపీ రాష్ట్ర ప్రతినిధిగా ఇంద్రసేన్‌రెడ్డి

16-03-2026 12:37 AM

హైదరాబాద్, మార్చి 15 (విజయక్రాంతి): టెక్నాలజీ, సోలార్ ఎనర్జీ, రియల్ ఎస్టేట్ రంగాలలో మూడు దశాబ్దాల అనుభవం కలిగిన వ్యాపారవేత్త, పెట్టుబడి దారుడు బి ఇంద్రసేన్‌రెడ్డి తెలంగాణ బీజేపీ రాష్ట్ర ప్రతినిధిగా నియమితులయ్యారు. ప్రకృతి, విశ్వశక్తిపై గాఢమైన విశ్వా సం కలిగిన ఆయన, నిజాయితీతో మరియు సమానత్వ భావంతో తెలంగాణ రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. బాధ్యతను అప్పగించినందుకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు.