బోధన్ మార్కెట్‌కు వచ్చేవారు జాగ్రత్త
26-07-2026 03:33 PM
- పట్టణ సీఐ వెంకట నారాయణ హెచ్చరిక
బోధన్,(విజయక్రాంతి): బోధన్ పట్టణంలోని ఆదివారం కూరగాయల మార్కెట్‌కు వచ్చే ప్రజలు జేబుదొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలని పట్టణ సీఐ వెంకట నారాయణ సూచించారు. మార్కెట్‌లో అధిక రద్దీని ఆసరాగా చేసుకుని జేబుదొంగలు చోరీలకు పాల్పడే అవకాశం ఉన్నందున ప్రజలు తమ నగదు, బంగారం, మొబైల్ ఫోన్లు, ఇతర విలువైన వస్తువులను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని తెలిపారు.
అలాగే, అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తులు కనిపించినా లేదా అనుమానాస్పద కదలికలు గమనించినా వెంటనే సమీప పోలీసు సిబ్బందికి లేదా పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సీఐ వెంకట నారాయణ కోరారు. ప్రజల అప్రమత్తతతోనే చోరీలను అరికట్టడం సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.






