26 July, 2026 | 4:12 PM

స్మార్ట్ సిటీ పనుల్లో నాణ్యతా లోపం

26-07-2026 03:35 PM

ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థ స్మార్ట్ సిటీ పనుల్లో నాణ్యత లేని కారణంగా రోడ్లు, డ్రెయిన్లు కొట్టుకు పోయాయని వాటిపైన విచారణ చేపట్టాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి శివరాజ్ డిమాండ్ చేశారు. నగరంలో ఎక్కడ చూసినా స్మార్ట్ సిటీ పనులు పూర్తి చేసి ఉన్నట్టు లక్షల కోట్ల రూపాయలను కాంట్రాక్టర్ అక్రమంగా అవినీతిగా బిల్లులు తీసుకున్నారు తప్ప. ఎక్కడ చూసినా  రోడ్లు.మోరీ లు కొట్టుకు పోయాయని ఆరోపించారు. వెంటనే జిల్లా కలెక్టర్ .మున్సిపల్ కమిషనర్ ఒక విచారణ అధికారిని నియమించి నగరంలో స్మార్ట్ సిటీ పనులు గతంలో జరిగిన పనులపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.