31 August, 2026 | 7:13 PM

ఎన్నికల హామీలు అమలు చేయాలని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా

31-08-2026 06:39 PM

దమ్మపేట,(విజయక్రాంతి): దమ్మపేట తహాశీల్దార్ కార్యాలయం(Dhammapeta Tehsildar office) ఎదుట సీపీఎం మండల కమిటీ(CPM Mandal Committee) సోమవారం ధర్నా నిర్వహించి, తహశీల్దార్ కార్యాలయం సిబ్బందికి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించింది. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం రూ.2 లక్షల రుణ మాఫీ సంపూర్ణంగా అమలు చేయాలని, భూమి లేని కూలీలకు సంవత్సరానికి 12 వేల రూపాయలు ఇవ్వాలని, అర్హలైన ప్రతి కుటుంబంలో మహిళలకు నెలకు రూ.2500 ఇవ్వాలని, ఇంటి స్థలం లేని వారికి ప్రభుత్వం స్థలం ఇచ్చి  ఇందిరమ్మ గృహాలు నిర్మించాలని, అర్హులైన వారికి రేషన్ కార్డు లు ఇవ్వాలని, పోడుసాగుదార్లకు పట్టా హక్కు పత్రాలు ఇవ్వాలని, పోడు రైతులు వేసిన పంటలను ఫారెస్ట్ అధికారులు పీకేయడం వంటి వాటిని నిలిపేయాలని కోరారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల్లో చేసిన అన్ని వాగ్దానాలు అమలు చేయాలని పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.