ఏఎమ్మార్పీ ద్వారా నీటి విడుదల చేయాలని ధర్నా
31-07-2025 02:28 PM
- బిఆర్ఎస్, సిపిఎం మద్దతు
- నల్గొండ రూరల్: ఏ ఎం ఆర్ పి ద్వారా నీటి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తిప్పర్తి మండల(Thipparthi Mandal) కేంద్రంలో గురువారం రైతులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. డి 39, డి 40 కాల్వలకు వెంటనే నీటిని విడుదల చేసి చెరువులు నింపాలని డిమాండ్ చేశారు ఏ ఎం ఆర్ పి ప్రధాన కాలువలో(AMRP Main Canal) పూర్తిస్థాయిలో నీటి విడుదల చేసి పానగల్ చెరువును పూర్తిస్థాయిలో నింపాలని కోరారు సాగర్ ప్రాజెక్టు నుండి నీరు వృధాగా దిగివకు వెళ్లకుండా సద్వినియోగం చేయాలని కోరారు చెరువుల్లో నీరు లేక భూగర్భ జలం తగ్గిపోయిందని పంటల సాగులో రైతులు ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వ, అధికారులు వెంటనే స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైతుల ధర్నాకు బిఆర్ ఎస్ , సిపిఎం నాయకులు మద్దతు ఇచ్చి పాల్గొన్నారు.
నాగార్జునసాగర్(Nagarjunasagar) నుండి 26 గేట్ల ద్వారా నీళ్లు సముద్రంలో కలుస్తున్నప్పటికీ జిల్లా జిల్లా రైతుల సాగునీటి కష్టాలను తీర్చడంలో వృధా నీటిని సద్వినియోగం చేయడంలో మంత్రులు, శాసనసభ్యులు పట్టించుకోవడం లేదన్నారు. పానగల్ ఉదయ సముద్రంలో 1.5 టిఎంసి నీటిని పూర్తిస్థాయిలో నింపి ఆయకట్టు పరిధిలోని అన్ని చెరువుల నింపి, రైతులకు పంటల కోసం నీరు అందించాలని డిమాండ్ చేశారు, ఆదివారం వరకు పూర్తిస్థాయిలో నీటి వీడు దలక చేయక పోతే సోమవారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రైతులతో కలిసి ముట్టడిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో.మాజీ జెడ్పిటిసి తండు సైదులు గౌడ్, బిఆర్ఎస్ నాయకులు కందుల లక్ష్మయ్య, సిపిఎం మండల కార్యదర్శి మన్నెం బిక్షం, రైతులు గుండెబోయిన రామచంద్ర, గుండేబోయిన సైదులు, రొట్టెల జానయ్య, దేవి రెడ్డి లింగారెడ్డి, చింతకుంట్ల దయాకర్ రెడ్డి, నూకల ప్రవీణ్, రావుల సందీప్, నూకల రాజీవ్, బైరగోని శ్రీను జాకటి బాలయ్య, కట్ట కిట్టు, గుండు రవి, జానీ పాషా, కస్పరాజు వెంకన్న, రొట్టెల సైదులు, మర్రి వెంకన్న, దేవిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు






