calender_icon.png 1 August, 2025 | 10:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే సార్.. కలెక్టర్ సార్ మాకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించండి

31-07-2025 01:43:50 PM

  • ఇందిరమ్మ ఇంటి లిస్టులో పేరు ఉన్న.. ఫైనల్ లిస్టులో లేదని మహిళ కుటుంబీకుల ఆవేదన.
  • అధికారుల నిర్లక్ష్యమే ..మాకు శాపమా, విచారణ జరిపించాలి

తుంగతుర్తి, (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన గాదంగి శ్రావణి, గాదంగి ఉమా, గాదంగి రేణుకలు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలంటూ రెండు చేతులతో దండాలు పెడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలుకు, జిల్లా కలెక్టర్కు తమ గోడును విన్నవించుకోవడం జరిగింది.. రెక్కడితే కానీ డొక్కాడని కుటుంబం మాది అని తుంగతుర్తి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మొదటగా ఇందిరమ్మ ఇల్లు  మంజూరి అయిందని చెప్పి, లబ్ధిదారుల మంజూరి పత్రం పంపిణీ కార్యక్రమంలో ఇల్లు రాలేదని తెలిపారని, దీనితో మేము ఆవేదనకు గురైనము గత కొన్ని సంవత్సరాలుగా వర్షం వస్తే ఇల్లు చెరువును తలపిస్తుందని మోకాల్లా లోతు నీళ్లలో కుటుంబాన్ని సవరించుకోవాల్సిన వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

గడిచిన తొమ్మిది సంవత్సరాల కాలంలో నిరుపేదలకు ఇల్లు వస్తదనుకుంటే గత ప్రభుత్వం విస్మరించింది. నేడు ఇందిరమ్మ రాజ్యంలో, ప్రజాపానులో భాగంగా పేద ప్రజలకు న్యాయం జరుగుతుందనుకుంటే, అది కూడా కనబడుటలేదు. స్థానిక అధికారుల నియంతృత్వ పోకడ, ముమ్మాటికి నిర్లక్ష్యమే మా కుటుంబానికి ఇల్లు రాలేదని అర్థమవుతున్నది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,ఎమ్మెల్యే మందుల సామెల్, జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి, పూర్తిస్థాయిలో విచారణ జరిపించి మా పేద కుటుంబానికి, వెంటనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కుటుంబీకులు దండాలు పెడుతూ, వినూత రీతిలో నిరసన వ్యక్తం చేశారు.