పీఆర్సీ, పాత పెన్షన్, హెల్త్ స్కీమ్ సమస్యలు పరిష్కరించాలి
భూపాలపల్లి, ఆగస్టు 27 (విజయ క్రాంతి): ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భూపాలపల్లి కలెక్టరేట్ ఎదుట టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీజీఈజేఏసీ చైర్మన్ బూరుగు రవి మాట్లాడుతూ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మంచి ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ అమలు చేయడంతో పాటు సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు.
టీజీఈజేఏసీ సెక్రటరీ జనరల్ విజయలక్ష్మి మాట్లాడుతూ ఉద్యోగుల బేసిక్ పే నుంచి 1.5 శాతం చొప్పున మినహాయింపు చేస్తున్నప్పటికీ హెల్త్ స్కీమ్ అమలులో జాప్యం జరుగుతోందని అన్నారు. హెల్త్ స్కీమ్‌ను పూర్తిస్థాయిలో అమలు చేసి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు అన్ని గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందించాలని, పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయ సంఘాల నాయకులు సుభాకర్ రెడ్డి, డీఆర్ మధుసూదన్, శ్రీనివాసరావు, రాజకుమార్, తిరుపతి, అజహర్, శ్రీదేవి ప్రవీణ్, సాంబశివరావు, కిరణ్ కుమార్, నక్క తిరుపతి, ఏ. దశరథ రామారావు, షఫీ అహ్మద్, జ్ఞానేశ్వర్ సింగ్, మురళీధర్ రెడ్డి, కుమారస్వామి, మందల రవీందర్ రెడ్డి, లక్ష్మణబాబు, చిలువేరు అశోక్, తిరుపతిరెడ్డి, సేవానాయక్, కుర్రే ప్రవీణ్ కుమార్, రమేశ్ నాయక్, రాచర్ల శ్రీనివాస్, స్వాతి, మల్లీశ్వరి, దిల్షాద్, భార్గవ్, బోనాల రాజమౌళి, రామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు.






