27 August, 2026 | 7:53 PM

ఎస్ఐఆర్‌పై గ్రామాల్లో ఓటర్లకు అవగాహన

27-08-2026 06:49 PM

మల్లాపూర్,(విజయక్రాంతి): ఎస్ఐఆర్‌  ప్రక్రియపై ఓటర్లకు అవగాహన కల్పించేందుకు మల్లాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా మొగిలిపేట, వెంకట్రావుపేట, రేగుంట గ్రామాల్లో అధికారులు, సిబ్బంది ఓటర్లకు ఎస్ఐఆర్‌ ప్రక్రియపై వివరించారు.ఈ సందర్భంగా ఓటర్ల జాబితాలో తమ పేరు, వివరాలు సక్రమంగా ఉన్నాయా లేదా అనే విషయాలను ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలని సూచించారు.

అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరు ఉండేలా చూసుకోవడంతో పాటు, తప్పులు లేదా మార్పులు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు.ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైనదని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కుపై అవగాహన కలిగి ఉండాలని అధికారులు సూచించారు. ఎస్ఐఆర్‌ ప్రక్రియకు సంబంధించి ప్రజలకు ఉన్న సందేహాలను నివృత్తి చేస్తూ అవసరమైన సమాచారాన్ని అందించారు. కార్యక్రమాల్లో ఆయా గ్రామాల ప్రజలు, యువత, మహిళలు తదితరులు పాల్గొన్నారు.