calender_icon.png 20 December, 2025 | 3:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీపీసీసీ ధర్నా

20-12-2025 01:51:51 PM

పీసీసీ ఆందోళన

హైదరాబాద్: ప్యారడైజ్ ఎంజీరోడ్(Paradise MG Road)లో ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ(Mahatma Gandhi) పేరును తొలగింపుకు నిరసనగా టీపీసీసీ చీఫ్(TPCC chief) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసనలో మహేశ్ గౌడ్, మంత్రులు జూపల్లి కృష్ణారావు, అజారుద్దీన్, వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే నవీన్ యాదవ్, వీహెచ్ పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు నిరసనలు చేశారు.

కేంద్రం నిర్ణయంపై(Central Government) దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని, బాపు అంటే ప్రతి యువకుడు ఆలోచన చేస్తాడని మంత్రి వాకిటి శ్రీహరి వెల్లడించారు. బాపు విషయంలో కేంద్రం నిర్ణయం వెనక్కి తీసుకోవాలని మంత్రి వాకిటి డిమాండ్ చేశారు. చట్టాన్ని వెనక్కి తీసుకోకుంటే పోరాటం చేస్తామని, ఉపాధి హామీ పథకం పేరు మార్పు దారుణమని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకాన్ని తొలగించాలని బీజేపీ చూస్తోందని మండిపడ్డారు. ప్రపంచలోని అన్ని దేశాల్లో గాంధీ విగ్రహాలున్నాయని, గాంధీ పేరు తొలగించడం దుర్మార్గమని మంత్రి అజారుద్దీన్ స్పష్టం చేశారు.