‘ధిక్కార’ పుస్తకావిష్కరణ
మహాత్మా ఫూలే స్ఫూర్తి కవిత్వం ‘ధిక్కార’ పుస్తకావిష్కరణ 8వ తేదీన హైదరాబాద్, రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్‌లో జరగనుంది. ‘నెలపొడుపు’ సాహిత్య సాంస్కృతిక వేదిక, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఆ రోజు ఉదయం 10 గంటలకు మొదలయ్యే ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, ఐఏఎస్ బుర్రా వెంకటేశం ముఖ్యఅతిథిగా హాజరై పుస్తకావిష్కరణ చేస్తారు. ఎంఎల్‌సీ, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గోరటి వెంకన్న, రాష్ట్ర సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్, కవి, విమర్శకులు జి.లక్ష్మీనరసయ్య, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డా॥ మామిడి హరికృష్ణ, కవి, విమర్శకులు డా॥బి. ప్రసాదమూర్తి, కవి, రచయిత్రి విశ్రాంత అధ్యాపకులు డా॥ ఏ.జయంతి, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత డా॥ పసునూరి రవీందర్ విశిష్ట అతిథులుగా హాజరవుతారు. సాహిత్య విమర్శకులు, చరిత్రకారులు డా॥ సంగిశెట్టి శ్రీనివాస్ అధ్యక్షత వహించే సభకు సంపాదకుల తరఫున స్పందనను కవి, రచయిత వనపట్ల సుబ్బయ్య తెలియజేస్తారు. కవి, కథకులు పి.వహీద్ ఖాన్ ఆహ్వానం పలుక నుండగా, కవి, రచయిత ఆమ్ గోత్ వెంకట్ పవార్ వందన సమర్పణతో కార్యక్రమం ముగుస్తుందని నిర్వాహకులు కందికొండ మోహన్, కల్వకోల్ మద్దిలేటి, ఎదిరెపల్లి కాశన్న, ముచ్చర్ల దినకర్, యం.డి.ఖాజ తెలిపారు.






