ధోనీకి ఇంకా ఫిట్‌నెస్ సమస్య.. ఢిల్లీ మ్యాచ్‌కు దూరం అయ్యే అవకాశం
చెన్నై , ఏప్రిల్ 7 : ఐపీఎల్ 19వ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్‌కు గాయాల బెడద వీడడం లేదు. ఇప్పటి వరకూ ఆడిన మూడు మ్యాచ్‌లలో ఓడిపోయిన సీఎస్కే పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో నిలిచింది. ధోనీ, బ్రెవిస్ గాయాలతో దూరమవడం తీవ్ర ప్రభావం చూపింది. బ్రెవిస్ ఫిట్ నెస్ సాధించగా.. ధోనీ మాత్రం ఇంకా కోలుకోలేదు. కాలి కండరాల సమస్యతో ఐపీఎల్ 2026కి రెండు వారాల పాటు దూరమైన ధోనీ, చెపాక్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగే మ్యాచ్తో ఎంట్రీ ఇస్తాడని అందరూ అనుకున్నారు.
ఆ మేరకే ధోనీ నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలు.. భారీ షాట్లతో సిక్సర్లు కొట్టే వీడియోలు నెట్టింట హల్చల్ కూడా చేశాయి. దాంతో ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో ఆడడం ఖాయమని అందరూ అనుకున్నారు. అయితే ధోనీ కండరాల సమస్య నుంచి పూర్తి స్థాయిలో కోలుకోలేదని, ఫిట్‌నెస సాధించలేదనే వార్తలు వినిపిస్తున్నాయి.
ధోనీ ర్తిగా కోలుకోవడానికి కనీసం ఇంకొక వారం సమయం పట్టే అవకాశం ఉంది. దాంతో ఏప్రిల్ 11న చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌కు అందుబాటులో ఉండే అవకాశం లేదు. .ఏప్రిల్ 18న కేకేఆర్ తో మ్యాచ్‌కు ధోనీ జట్టులోకి వచ్చే ఛాన్సుంది. మరోవైపు బ్రెవిస్ కోలుకోవడంతో చెన్నైకి ఊరటగా చెప్పొచ్చు.

ఇవి కూడా చదవండి:
గుజరాత్ థ్రిల్లర్ విక్టరీ: ఢిల్లీపై 1 పరుగుతో గెలుపు.. మిల్లర్ పోరాటం వృథా
ఈడెన్‌లో కేకేఆర్ Vs లక్నో ఫైట్: తొలి గెలుపు కోసం కోల్‌కతా పోరాటం
ఆయుశ్ షెట్టి సంచలనం: వరల్డ్ నెం.7 ఫెంగ్‌పై అద్భుత విజయం
అనుభవాధారిత విద్యను అందించడమే లక్ష్యం
జైస్వాల్-వైభవ్ విధ్వంసం: రాజస్థాన్ హ్యాట్రిక్ విజయం… ముంబైకి వరుస షాక్ ఓటమి!
షూటింగ్ వరల్డ్‌కప్‌లో భారత్ సంచలనం: పాలక్-ముకేశ్ గోల్డ్… వరల్డ్ రికార్డ్ బ్రేక్!
బుమ్రా Vs 15ఏళ్ల వైభవ్.. ముంబై-రాజస్థాన్ మ్యాచ్‌లో అసలైన ఫైట్ ఇదే!




