పాలక్, ముకేశ్ ప్రపంచ రికార్డు
షూటింగ్ వరల్డ్‌కప్‌లో భారత్‌కు స్వర్ణం
స్పెయిన్, ఏప్రిల్ 7: ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (ఐఎస్‌ఎస్‌ఎఫ్) వరల్డ్‌కప్‌లో భారత షూటర్లు పాలక్, ముకేశ్ చరిత్ర సృష్టించారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో 487.7 స్కోరుతో స్వర్ణ పతకం గెలుచుకున్నారు. ఇప్పటి వరకు ఇదే అత్యుత్తమ స్కోరుగా నమోదైంది.
దీనిలో పాలక్ 243, ముకేశ్ 244.7 పాయింట్లు సాధించారు. దీంతో ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఉజ్బెకిస్థాన్‌కు చెందిన నిజినా,కమలోవ్ జోడీ నెలకొల్పిన 481.3 పాయింట్ల రికార్డును బ్రేక్ చేశారు. ఆసియా క్రీడల్లో ఛాంపియన్‌గా నిలిచిన పాలక్ గులియా , ముకేశ్‌తో కలిసి ఫైనల్స్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ఈ క్రమంలో చైనా, హంగేరీ, యూఎస్‌ఏలకు చెందిన షూటర కంటే పైచేయి సాధించారు.ఇదిలా ఉంటే ఈ పోటీల్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారత షూటర్లు ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు.




