బీఆర్‌ఎస్‌తో డీల్ కుదరలేదా?

17-09-2026 | 05:15am
  1. వేల ఎకరాల భూమిని కబ్జా చేశారని చెప్పేందుకు వెయ్యి రోజులు పట్టిందా!
  2. ఏఐసీసీకి ఈఎంఐ చెల్లింపుపై ఒత్తిడి పెరిగిందా
  3. అందుకే అసెంబ్లీ వేదికగా బీఆర్‌ఎస్ నేతలకు ఓపెన్ ఆఫర్!
  4. కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై 30 రోజుల గడువు పేరుతో డీల్?
  5. బీఆర్‌ఎస్ భూములపై బీజేపీ దండయాత్ర
  6. ఆ భూముల్లో కాషాయ జెండాలు ఎగరేసి పేదలకు పంచుతాం
  7. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

కరీంనగర్, సెప్టెంబరు 16 (విజయ క్రాంతి): బీఆర్‌ఎస్ నేతల(BRS leaders)తో డీల్ కుదరక, ఏఐసీసీకి కట్టాల్సిన ఈఎంఐ గడువు ముంచుకొస్తుండటంతో ఒత్తిడి పెరిగి బీఆర్‌ఎస్ నేతలు(BRS leaders) వేల ఎకరాల భూమిని కబ్జా(Land encroachment) చేశారని చెప్పడానికి సీఎం రేవంత్‌రెడ్డికి వెయ్యి రోజులు పట్టింది అని కేంద్ర హోంశాఖ సహా య మంత్రి బండి సంజయ్ నిలదీశారు. డీల్ కోసమే అసెంబ్లీ (Assembly) వేదికగా వివరాలు బయటపెట్టి బీఆర్‌ఎస్ నేతలకు ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారా అని ప్రశ్నించారు.

జిల్లాల కలెక్టర్లకు పూర్తి అధికారాలిస్తే 24 గంటల్లో పూర్తి నివేదిక ఇస్తారని, 30రోజుల గడువు పేరుతో డీల్ కుదుర్చుకోవాలనుకుంటున్నారా అని అనుమానం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ దోచుకున్న భూములపై బీజేపీ ఆధ్వర్యంలో దండ యాత్ర చేస్తామని బండి సంజయ్(Bandi Sanjay) ప్రకటించారు. ఆ భూముల్లో కాషాయ జెండా ఎగ రేసి పేదలకు పంచి పెడతామని చెప్పారు. బుధవారం కరీంనగర్ జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, నగర మేయర్, డిప్యూటీ మేయర్ లతో కలిసి బండి సంజయ్ మానకొండూ రు, చింతకుంట, కొత్తపల్లి ప్రాంతాల్లో పర్యటించి గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలిం చారు. ప్రజలకు ఇబ్బందుల్లేకుండా ఉత్సాహంగా నిమజ్జనోత్సవాలు జరుపుకునేలా  ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో బీఆర్‌ఎస్ భూదోపిడీని సీఎం ప్రస్తావించడం వెనుక పెద్ద మతలబు ఉన్నదన్నారు. యూపీ ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీకి ఈఎంఐ కట్టేందుకే అసెంబ్లీలో బీఆర్‌ఎస్ భూదోపిడీని ప్రస్తావించి ఆ పార్టీ తో బేరసారాలకు సిద్ధమయ్యారని చెప్పారు. అసెంబ్లీలో సీఎం వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగిస్తోందని, బీఆర్‌ఎస్‌కు సంబంధించి 8మంది ఎమ్మెల్యేల భూబాగోతం గురించి మాట్లాడటానికి గంట సమయం పట్టిందన్నారు.

మరి 90మంది ఎమ్మెల్యేల భూబాగోతం గురించి మాట్లాడాలంటే ఎన్ని రోజులు అసెంబ్లీ నిర్వహించాలని ప్రశ్నించారు. తెలంగాణలో 60 శాతం మంది ప్రజలకు భూముల్లేవని, 25 లక్షల కుటుంబాలకు ఇల్లు కట్టుకోవడాని కి గజం జాగ కూడా లేదన్నారు. కానీ బీఆర్‌ఎస్ నేతలు మాత్రం వేల ఎకరాల భూము లను దోచుకున్నారన్నారు.  పాదయాత్రలో నేను బీఆర్‌ఎస్ భూదోపిడీ గురించి మాట్లాడితే కేసీఆర్ నా తలను 6 ముక్కలు చేస్తాన న్నారు.. అయినా కేసీఆర్ మెడలు వంచి ఫాంహౌజ్ నుండి గుంజుకొచ్చి ప్రజల ముందుంచామని తెలిపారు.

‘బీఆర్‌ఎస్ నేతలు వేల ఎకరాల భూమిని కబ్జా చేశారని చెప్పడానికి వెయ్యి రోజులు పట్టిందా సీఎంగారు. బీఆర్‌ఎస్ నేతలతో డీల్ కుదరలేదా అని ప్రశ్నించారు. ఏఐసీసీకి కట్టాల్సిన ఈఎంఐ గడువు ముంచుకొస్తుండటంతో ఒత్తిడి పెరిగిందా? అసెంబ్లీ వేదికగా వివరాలు బయటపెట్టి బీఆర్‌ఎస్ నేతలకు ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారా? అసెంబ్లీ సాక్షిగా సిట్ పేరుతో మీరు నియమించిన విచారణ కమిటీలు ఏమయ్యాయి, బేరాలు కుదరగానే సిట్‌ను నీరుగార్చడం సీఎంకు అలవాటే’ అని ఎద్దేవా చేశారు. 

సిట్ అంటే సిట్, స్టాండ్ కమిటీలు

సీఎం సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్‌లా కమిటీలు మారాయని, ఈ భూ ములపై కూడా విచారణ పేరుతో ఇంకెన్నాళ్లు లాగుతారన్నారు. జిల్లాల కలెక్టర్లకు పూర్తి అధికారాలిస్తే 24 గంటల్లో పూర్తి నివేదిక ఇస్తారని, 30 రోజుల గడువు పేరుతో డీల్ కుదుర్చుకోవాలనుకుంటున్నారా అని అనుమానం వ్యక్తం చేశారు. విద్యుత్ కొనుగోళ్లు, ఈ ఫార్ములా రేసు, కాళేశ్వరం, గొర్రెల స్కాం  కేసులన్నీ ఏమయ్యాయి, ఫారెస్ట్ భూ ముల కబ్జాపై చర్యలేవి అని ప్రశ్నించారు. పేదలు అటవీ భూమిలో సాగు చేస్తే నానా ఇబ్బందులు పెడతారు, కానీ బీఆర్‌ఎస్ నేతలు వందల ఎకరాల ఫారెస్ట్ భూమిని కబ్జా చేస్తే చర్యలేవని నిలదీశారు. 

మరిన్ని వార్తలు