డిజిటల్ హెల్త్ ప్రొఫైల్!
- పైలెట్ ప్రాజెక్టుగా సంగారెడ్డి జిల్లాలో ప్రారంభం
- ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
సంగారెడ్డి, మార్చి 12 (విజయక్రాం తి): రాష్ట్రంలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను మరింత సమర్థవంతం గా అందించేందుకు డిజిటల్ హెల్త్ ప్రొ ఫైల్ వ్యవస్థను అమలు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టుగా సంగారెడ్డి జిల్లాలో అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
గురువారం సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపకల్పన, అమలుపై రాష్ట్ర, జిల్లా స్థాయి వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సన్నాహాక సమావేశం నిర్వహించారు. మంత్రి దామో దర మాట్లాడుతూ.. పైలెట్ ప్రాజెక్టు అమలులో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని మొత్తం 64 ప్రభుత్వ వైద్యశాలల్లో (జీజీహెచ్1, ఏరియా ఆసుపత్రులు4, క మ్యూనిటీ హెల్త్ సెంటర్లు5, అర్బన్ ప్రై మరీ హెల్త్ సెంటర్లు4, ప్రైమరీ హెల్త్ సెంటర్లు31, బస్తీ దవాఖానా లు19) సేవలు పొందేందు కు వచ్చే ప్రతి రోగికి సంబంధించిన పూర్తి ఆరోగ్య వివ రాలతో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్‌ను రూ పొందించి డిజిటల్ హెల్త్ కార్డు జారీ చేయడానికి కసరత్తును ప్రా రంభించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
రోగి ఆసుపత్రికి వచ్చిన మొదటి దశ నుంచి చికిత్స పూర్తయ్యే వరకు ఓపీ, మెడికల్ ఆఫీసర్, ల్యాబ్, ఫార్మసీ వంటి అన్ని విభాగాల్లో రోగి వైద్య చరిత్రను డిజిటల్ రూపంలో నమోదు చేసే విధంగా అవసరమైన ఐటీ సదుపాయాలు, మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని, అవసరమైన సి బ్బందిని అందుబాటులో ఉంచాలని మంత్రి కలెక్టర్ ప్రావీణ్యకు సూచించా రు. ఆరోగ్య శాఖ కార్యదర్శి డా.క్రిస్టినా జెడ్. చొంగ్తు, ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ సీఈవో ఉదయ్ కుమార్ పాల్గొన్నారు.




