calender_icon.png 20 July, 2025 | 4:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డర్టీ 7

20-07-2025 12:00:00 AM

భారత్ ఎంత ప్రయత్నించినా చిక్కని ఏడుగురు ముష్కరులు

న్యూఢిల్లీ, జూలై 18: ఏండ్లుగా భార త్ సీమాంతర ఉగ్రవాదంతో సతమ తం అవుతోంది. కొంత మంది పేరు మోసిన ఉగ్రవాదులు ఉగ్రవాద సంస్థలను నెలకొల్పి భారత్‌లో రక్తపాతం సృ ష్టిస్తున్నారు. వరుసగా దాడులు చేస్తూ భారత్‌లోని అమాయక ప్రజలను పొ ట్టన పెట్టుకుంటున్నారు. వీరిని పట్టుకునేందుకు భారత్ ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించడం లేదు. దాయా ది పాకిస్థాన్ ఈ ఉగ్రవాదులకు ఆశ్ర యం కల్పిస్తూ భారత్ మీదకి ఉసిగొల్పుతోంది.

మరీ ముఖ్యంగా ఏడుగురు ఉగ్ర వాదులు భరతమాత ఒడిపై వరుసగా గా యాలు చేస్తున్నారు. భారత్ వారిని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులుగా భావించి పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నా పాక్ ప్రతి సారీ రక్షిస్తోంది. పాకిస్థాన్ ఆర్మీ, ఐఎస్‌ఐ ఈ ఉగ్రవాదులపై ఈగ వాలకుండా కాపాడుకుంటూ వస్తున్నాయి. ఏకంగా సైనికులతోనే వీరికి భద్రత కల్పిస్తూ అంతర్జాతీయ సమా జం ముందు చులకనవుతూ వస్తోంది. ఆ ఏడుగురు ఉగ్రవాదులు ఎవరు.. 

హఫీజ్ సయీద్

లష్కరే తోయిబా ఉగ్రసంస్థ పేరు చెబితేనే చాలు నరరూప రాక్షసులు మనకు గుర్తుకు వస్తారు. అటువంటి లష్కరే తోయిబా ఉగ్రసంస్థను హఫీజ్ సయీద్ స్థాపించారు. 1990ల ప్రారంభంలో పాకిస్థాన కేంద్రంగా ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ మిషనరీ గ్రూప్ ‘మర్కజ్ అనే సైనిక విభాగాన్ని స్థాపించగా.. అదే లష్కరే తోయిబాగా ఆవిర్భవించింది. హఫీజ్ సయీద్ పేరు చెప్పగానే 2006 ముంబై రైలు పేలుళ్లు, ముంబై 26/11 దాడులు మన కండ్ల ముందు మెదులుతాయి.

ఈ రెండు దాడుల్లో 360కి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దేశరాజధాని న్యూఢిల్లీలోని ఎర్రకోట మీద కూడా ఈ ఉగ్రసంస్థ దాడులు జరిపింది. అమెరికాతో పాటు ఐక్యరాజ్య సమితి కూడా హఫీజ్ సయీద్‌ను ఉగ్రవాదిగా గుర్తించింది. ముష్కరుడు హఫీజ్ తలపై 10 మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ ఉంది. ఇన్ని చేసిన హఫీజ్ సయీద్‌కు  పాక్ ప్రభుత్వం సకల మర్యాదలు కల్పిస్తోంది. అతడు ప్రస్తుతం రాజభోగాలతో లాహోర్‌లో హాయిగా నివసిస్తున్నాడు. 

మసూద్ అజార్

మసూద్ అజార్ అనే మరో కరుడుగట్టిన ఉగ్రవాదిని కూడా తమకు అప్పజెప్పాలని భారత్ కోరుతోంది. భారత్ ఎంత కోరుతున్నా, ఎన్ని ఆధారాలు చూపుతున్నా కానీ పాక్ మాత్రం మసూద్ జాడ తమకు తెలియదని అబద్దాలు చెబుతోంది. ‘జైషే మహ్మద్’ ఉగ్రసంస్థను స్థాపించి భారత్‌లో అనేక మారణహోమాలకు కారణం అవుతున్నాడు. స్వయంగా పాకిస్థాన్ సైన్యమే మసూద్ అజార్‌కు రక్షణ కల్పించడం విడ్డూరం.

పుల్వామా దాడి, యూరీ దాడులకు ఈ సంస్థే ప్రధాన కారణం. ఈ రెండు దాడుల్లో కలిపి 59 మంది భారత సైనికులు వీర మరణం పొందారు. 2019లోనే మసూద్ అజార్‌ను ఐక్యరాజ్య సమితి గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించినా.. పాక్ మాత్రం అతడికి రక్షణ కల్పిస్తూనే ఉంది. మసూద్ అజార్ ఎక్కడ ఉన్నాడో తమకు తెలియదని పాక్ ఇంకా ప్రపంచాన్ని మోసం చేయాలని చూస్తూనే ఉంది. ఎన్ని సార్లు ప్రపంచం ముందు జోకర్ అవుతున్నా పాక్ మాత్రం తన వైఖరిని మార్చుకోవడం లేదు. 

జకీర్ రెహ్మాన్ లఖ్వీ

లష్కరే తోయిబా ఉగ్రసంస్థలో మరో కీలక వ్యక్తి జకీర్ రెహ్మాన్ లఖ్వీ. ఈ ముష్కరుడిని కూడా తమకు అప్పగించాలని భారత్ ఎన్నో రోజుల నుంచి కోరుతున్నా పాక్ చీమ కుట్టిన దొంగలా వ్యవహరిస్తోంది. 26/11 ముంబై దాడులకు ఇతడే ప్రధాన సూత్రధారి. ముంబై దాడిలో జకీర్ ప్రమేయం ఉన్నట్టు పలు సాక్ష్యాలను కూడా భారత్ పాక్ ముందుంచింది.

అయినా దాయాది మాత్రం జకీర్‌ను అప్పగించడం లేదు. ఇతడు పాకిస్థాన్‌లోనే తలదాచుకుంటున్నా తమకు తెలియదని దాయాది దాటవేత ధోరణిని ప్రదర్శిస్తోంది. అంతర్జాతీయ సమాజంలో పరువు పోతున్నా పాకిస్థాన్‌కు మాత్రం చీమ కుట్టినట్టునా లేకపోవడం శోచనీయం. 

సయ్యద్ సలావుద్దీన్

హిజ్బుల్ ముజాహిదీన్ అనే ఉగ్రసంస్థను స్థాపించి పలు దాడులకు కారణం అయ్యాడు. ఇన్ని దాడులు చేసినా పాక్ మాత్రం చలించడం లేదు. కశ్మీర్‌పై ప్రతి రోజు విషం చిమ్ముతూనే ఉన్నాడు. కశ్మీర్ లోయను భారత సైనిల స్మశానవాటికగా మారుస్తా అంటూ గతంలో పలు హెచ్చరికలను కూడా జారీ చేశాడు.

అమెరికా విదేశాంగ శాఖతో పాటు భారత జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఇతడిని ఉగ్రవాదిగా ప్రకటించి అరెస్ట్ చేసేందుకు ఎదురుచూస్తున్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో భారత వ్యతిరేక ర్యాలీలకు ఇతడే నాయకత్వం వహిస్తున్నట్టు సమాచారం. 

దావూద్ ఇబ్రహీం.. 

దావూద్ ఇబ్రహీం గురించి చాలా మందికే తెలిసి ఉంటుంది. ఒకానొక సమయంలో ముంబైలో మాఫియా ను శాసించి.. అండర్ వరల్డ్ డాన్‌గా ఎదిగాడు. డీ కంపెనీని ఏర్పాటు చేసిన అనేక అఘాయిత్యాలు చేశాడు. డీ కంపెనీ పేర హత్యలు, దోపిడీలు, డ్రగ్స్, ఉగ్రవాదం వంటి అనేక సంఘ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించాడు. 1993 ముంబై పేలుళ్లకు దావూ ద్ ఇబ్రహీం ప్రధాన సూత్రధారి అని అంతా భావిస్తారు. ఆనాటి పేలుళ్లలో 257 మంది మరణించారు.

భారత్, అమెరికా 2003లో ఇతడిని ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించాయి. అమెరికాకు చెందిన దర్యాప్తు సంస్థ కూడా ఇతడిని మోస్ట్ వాం టెడ్ జాబితాలో ఉంచి అతడి గురించి వెతుకుతోంది. దావూద్ ఇబ్రహీంపై 25 మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ ఉంది. ఇంత పెద్ద ఎత్తున ప్రైజ్ మనీ ఉందంటేనే దావూద్ ఎంత కరుడు గట్టిన ఉగ్రవాదో ఇట్టే అర్థం అవుతోంది.

ఇన్ని నేరాలు చేసిన దావూద్ ఇబ్రహీం ప్రస్తుతం కరాచీలో నివసిస్తున్నట్టు సమాచారం. కరాచీలోని విలాసవంతమైన ప్రాంతంలో దావూద్ ఇబ్రహీం నివసిస్తున్నాడు. పాక్ సైనికులు పహారా కాస్తుంటే దావూద్ విలాసవంతమైన భవనంలో నివసిస్తున్నట్టు సమాచారం. 

ఇక్బాల్ భత్కల్

ఇండియన్ ముజాహిదిన్ గ్రూపుకు చెం దిన ఉగ్రవాది ఇక్బాల్ భత్కల్. ఈ ఉగ్రవాది కూడా పాక్‌లో నే ఆశ్రయం పొందుతున్నట్టు పలు పక్కా ఆధారాలు ఉన్నాయి. ఇన్ని ఆధారాలు ఉన్నా కానీ పాక్ మాత్రం భత్కల్ తమ వద్ద ఉన్నట్టు ఒప్పుకోవడం లేదు. ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన ఇక్బాల్ భారత్‌లో స్లీపర్ సెల్స్ నెట్‌వర్క్‌ని నిర్వహిస్తున్నాడు.

వీరి ద్వారా ఎన్నో అఘాయిత్యాలకు పాల్పడుతున్నాడు. పై నుంచి ఆదేశాలు వచ్చేదాక తాము ఎందుకోసం పని చేస్తున్నాం... ఎవరి వద్ద పని చేస్తున్నాం.. సంఘ విద్రోహ శక్తులుగా పని చేస్తున్నాం అని కూడా స్లీపర్ సెల్స్‌కు తెలియకపోవడం గమనార్హం. 

రియాజ్ భత్కల్

కరుడుగట్టిన ఉగ్రవాది ఇక్బాల్ భత్కల్ సోదరుడే రియాజ్ భత్కల్. ఇతడు కూడా పాకిస్థాన్‌లోనే నివాసం ఉంటున్నాడు. రి యాజ్ భత్కల్ కూడా భారత్‌లో స్లీపర్ సెల్ నెట్‌వర్క్ రన్ చేస్తున్నాడు. పేద, మధ్య తరగతికి చెందిన అమాయకులనే వీరు టార్గెట్ చేస్తూ.. వారితో సంఘవిద్రోహ పనులు చేయిస్తున్నారు.

ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రసంస్థకు సహ వ్యవస్థాపకుడిగా ఉన్న రియాజ్ ఆ సంస్థకు కావాల్సిన నిధులను సమకూరుస్తూ ఉన్నాడు. వీరి నేతృత్వంలోని ఇండియన్ ముజాహిదీన్ భారత్‌లో ఎన్నో దాడులు చేసింది. ఎంతో మంది అమాయకులను పొట్టన పెట్టుకుంది. ఈ ఇద్దరు సోదరులు పాకిస్థాన్ కరాచీలో ఉన్నట్టు అంతా భావిస్తున్నారు.