12 May, 2026 | 1:38 PM

ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం

12-05-2026 12:32 PM

బెజ్జూర్ మే 12 (విజయ క్రాంతి):  బెజ్జూర్ మండల కేంద్రంలో చేతన ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని సిర్పూర్ మాజీ శాసనసభ్యులు కోనేరు కోనప్ప  ఆధ్వర్యంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఎదురుగా ఏర్పాటు చేసిన ఈ శిక్షణ కేంద్రాన్ని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సిడెం సకారం, బెజ్జూర్ సర్పంచ్ దుర్గం సరోజ తిరుపతి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యార్థులు, యువత వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుని కంప్యూటర్ విద్యను అభ్యసించి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. అడ్మిషన్ ప్రక్రియ కోసం సెల్ నంబర్: 8639460731 సంప్రదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, మాజీ కో ఆప్షన్ సభ్యులు, మాజీ సర్పంచ్లు, ప్రస్తుత సర్పంచ్లు, కార్యకర్తలు, కోనేరు అభిమానులు, విద్యార్థులు, యువత, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.