20-07-2025 12:00:00 AM
హనీట్రాప్‌లో బౌద్ధ సన్యాసులు
మూడేళ్లలో వంద కోట్లు కొల్లగొట్టిన విలావన్ ఎమ్సావత్
న్యూఢిల్లీ, జూలై 19: థాయ్‌లాండ్ అంటేనే బౌద్ధ మతానికి ప్రసిద్ధి. ఇక్కడ 90 శాతం మంది ప్రజలు బుద్ధుడిని తమ ఆరా ధ్య దైవంగా కొలుస్తున్నారు. అలాంటి థా య్‌లాండ్‌లోని ప్రతిష్ఠాత్మక ‘వాట్ త్రి థోట్సథేప్’ బౌద్ధారామం.. మహిళ వలపు వలలో చిక్కడం సంచలనంగా మారింది. 165 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ బౌద్ధ్ధా రామానికి చెందిన సన్యాసులు హనీట్రాప్‌లో చిక్కుకోవడం ఆ దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది.
థాయ్‌లోని వివిధ బౌద్ధారామాల్లో దాదాపు 2 లక్షల మంది బౌద్ధ సన్యాసులు, 85 వేల మంది శిష్యులు ఆవాసం ఉంటున్నారు. శాంతి నిలయాలకు పేరు గాంచిన ఇలాంటి బౌద్ధారామాల్లో సెక్స్ స్కాండల్స్ కుంభకోణాలు బయటపడటం కలకలం రేపింది. ఇదే ఆశ్రమానికి చెందిన వందలాది బౌద్ధ సన్యాసులతో విలావన్ ఎమ్సావత్ (35) అనే మహిళ శారీరక సంబంధాలు పెట్టుకొని బె దిరింపులకు పాల్పడటం చర్చనీయాంశమైంది.
వందలాది సన్యాసులు తనతో అత్యంత సన్నిహితంగా ఉన్న 80 వేల న్యూ డ్ ఫొటోలు, వీడియోలతో బ్లా క్ మెయిల్‌కు పాల్పడి దాదాపు వంద కోట్లు కాజేసింది. ఇటీవల ఒక సన్యాసి బౌద్ధ మ తం నుంచి బయటకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు దీనిపై దృష్టి సారించడంతో హనీట్రాప్ వ్యవహారం బయటపడింది.
సందేశాలు పంపి సన్యాసులకు దగ్గరై..
పోలీసుల దర్యాప్తులో విలావన్ చాలా మంది సన్యాసులను మోసం చేసిందని తేలింది. ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నట్టు కొంతమంది సన్యాసులు అంగీక రించారు. కొన్ని సందర్భాల్లో సామాజిక మాధ్యమాల్లో సన్యాసులకు మెసేజ్‌లు పంపుతూ వారికి దగ్గరైంది.
ఈ సందర్భంగా ఒక సన్యాసి మాట్లాడుతూ.. ‘ మా ఇద్దరి మ ధ్య చాలా కాలంగా సంబంధం ఉంది. ఆమె నాకు కారు కూడా బహుమతిగా ఇచ్చింది. కానీ ఆమెకు ఇంకో సన్యాసితో సంబంధం బయటపడింది. ఆ తర్వాత మా నుంచి డబ్బు లాగేందుకు బెదిరింపులకు దిగింది.’ అని తెలిపారు.
ఎవరీ విలావన్ ఎమ్సావత్?
థాయ్‌లాండ్‌కు చెందిన విలావన్ ఎమ్సావత్ మూడేళ్లలో తొమ్మిది మంది బౌద్ధ సన్యాసులు సహా పలువురు ప్రముఖులతో లైంగిక సంబంధాలు పెట్టుకుని వాటిని వీడియోలుగా తీసింది. ఆ తర్వాత బ్లాక్‌మెయిల్ కు పాల్పడు తూ దాదాపు 385 మిలియన్ బాత్ (రూ. 102 కోట్లు) సంపాదించింది. ఉత్తర బ్యాంకాక్‌లోని నాన్‌థాబురిలో ఒక విలాసవంతమైన ఇంట్లో ఆమె నివాసం ఉంటోంది.
అదే ఇంట్లో దాదాపు 80 వేల ఫోటోలు, వీడియోలు దాచి కథ మొత్తం నడిపించింది. సన్యాసుల నుంచి కొల్లగొట్టిన డబ్బునంతా డ్రా చేసుకొని , కొంత మొ త్తాన్ని జూదానికి ఉపయోగించిందని చెప్పా రు. దోపిడీ, మనీలాండరింగ్ వంటి ఆరోపణలపై పలు కేసులు కూడా ఎదుర్కొంటుంది. 2024 మేలో ఒక బౌద్ధ సన్యాసిని హనీట్రాప్ చేసి శారీరక సంబంధం పెట్టుకుంది. ఆ సంబంధం వల్ల ఒక బిడ్డ పుట్టిందని చెప్పి ఖర్చుల కోసం రూ. 1.85 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసింది.
తాజాగా వట్ త్రి థోట్సథేప్ ఆశ్రమానికి చెందిన ఒక సన్యాసి ఇటీవల కనిపించకుండా పోవడంతో వ్యవహారం బయటపడింది. ఈ ఘటనతో అప్రమత్తమైన థాయ్‌లాండ్ పోలీసులు విలావన్ ఎమ్సావత్ బాధితులు ఇంకా ఎవరైనా ఉన్నారా అని తెలుసుకునేందుక ఒక హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు చేశారు. సన్యాసులను ప్రలోభపెట్టిన విలాన్ ఎమ్సావత్‌కు ‘మిస్ గోల్ఫ్’ అని నామకరణం చేయడం గమనార్హం.
165 ఏళ్ల విశిష్ట చరిత్ర..
థాయ్‌లాండ్‌లోని వాట్ త్రి థె ట్సోథేప్ బౌద్ధ రామానికి దాదాపు 165 ఏళ్ల చరిత్ర ఉంది. 1860లో థా య్‌లాండ్ రాజు రామా కుమారు ల్లో ఒకరైన ప్రిన్స్ సుప్రదిట్ ఆశ్రమ నిర్మాణాన్ని ప్రారంభించారు. సప్రదిట్ మరణానంతరం అతడి తండ్రి మోంగ్‌కూట్ నిర్మాణం పూర్తి చేశారు.
ఇంతటి ప్ర ఖ్యాత బౌద్ధ రామంలో చాలా మంది బౌద్ద మత గురువులు తమ శాంతి సందేశాలు వినిపించారు. అయితే థా య్‌లాండ్‌లోని బౌద్ధ రా మాల్లో ఇ లాంటి లైంగిక, ఆర్థిక కుంభకోణాలు సాధారణమే అయినప్పటికీ.. మహిళ వలపు వలలో ఇంతమంది బౌద్ధ సన్యాసులు ఉండటం చర్చనీయాంశంగా మారింది.