బీసీ మంత్రిని బర్తరఫ్ చేయడం దుర్మార్గం
బీసీల ఓట్లతోనే ఈ ప్రభుత్వం అధికారంలోకి. బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్
నల్లగొండ టౌన్, సెప్టెంబర్ 4 : బీసీ మ హిళా మంత్రి కొండా సురేఖను(Konda Surekha,) బర్తరఫ్ చే యడం దుర్మార్గమైన చర్య అని బీసీ యువజన సంఘం(BC Youth Association) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకో లు దీపెందర్ అన్నారు. శుక్రవారం జిల్లా కేం ద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొండా సురేఖ ను మంత్రి పదవి(Ministerial post) నుండి అవమానకరంగా గెంటేయడం అంటే కాంగ్రెస్ పార్టీ(Congress Party) నుండి యావత్తు బీసీలను బహిష్కరించడమేనని అ న్నారు.
బీసీల ఓట్ల తోనే రేవంత్ రెడ్డి(Revanth Reddy) సీఎం అయ్యాడని, కాంగ్రెస్ పార్టీ(Congress Party) అధికారంలోకి వచ్చిందన్న విషయం గుర్తుంచుకోవాలన్నా రు. బీసీల ఓట్లు(BC votes) తీసుకున్నప్పుడు బీసీలు మంత్రిగా పనికిరారా అని ప్రశ్నించారు. అగ్రవర్ణ ఆధిపత్య వర్గాలకు ఒక న్యాయం కొండా సురేఖ విషయంలో మరొక న్యా యం ఉంటుందా అని నిలదీశారు.తన కూ తురు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడితే కూతురు వివరణ తీసుకుని పార్టీప రంగా క్రమశిక్షణ చర్యలు(Disciplinary actions) తీసుకోవాలే కానీ, రాజ్యాంగబద్ధమైన మంత్రి పదవి నుండి బ ర్తరఫ్ చేయడం ఏంటని ప్రశ్నించారు.
సీఎం పునరాలోచించి బర్తరఫ్ ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిప క్షంలో బలహీన వర్గాల ఆగ్రహానికి గురికాక తప్పదని, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. బీసీలను గౌర వించే సంప్రదాయాన్ని కాంగ్రెస్ అధిష్టానం కొనసాగించాలని, లేకపోతే రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు.ఈ సమావేశంలో నల్గొండ నియోజ కవర్గ అధ్యక్షుడు బొల్ల నాగరాజు, పట్టణ కార్యదర్శి ముక్కామల శ్రీనివాస్, నాయకులు జక్కలి సాయిరాం, కొడదల శంకర్, విగ్నేష్, రాజు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.






