22 June, 2026 | 11:58 AM

మేమేం పాపం చేశాం..?

22-06-2026 10:52 AM

 ఖానాపూర్ ప్రధాన రోడ్డు బాగు చేయాలని పట్టణవాసుల వేదన

 ఫ్లెక్సీలతో నిరసన

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ ప్రజలు మేమేం పాపం చేశాం..? అని స్థానిక పాలకులను అధికారులను ప్రశ్నిస్తూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారి దాదాపు 8 ఏళ్లుగా గుంతల మయమై రాకపోకలకు దారుణంగా తయారై ప్రజలు నానా అవస్థలు పడుతున్న ఇక్కడి పాలకులు పట్టించుకోవడంలేదని, తాము కట్టే పన్నులు రోడ్డు కోసం కాదా..? అని మేమేం పాపం చేశాం.. అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఆదివారం వినూత్నంగా పట్టణం ప్రధాన రహదారి లారీ అడ్డ కూడలిలో ఖానాపూర్ పట్టణ ప్రజల ఆవేదన అంటూ ఫ్లెక్సీలు కట్టి నిరసన తెలిపారు. పాలకులు తమ సమస్యను ఇదిగో చేస్తాం... అదిగో చేస్తామంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప రోడ్డు బాగు చేయడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణవాసులు రోడ్డు మీదికి వచ్చి ఆందోళన చేపట్టే దిశలో జేఏసీగా ఏర్పడనున్నట్లు నిరసన కారులు తెలుపుతూ సెక్సిలు ఏర్పాటు చేశారు. దీంతో పట్టణంలో ఎక్కడ చూసినా ఇదే చర్చ సాగుతోంది.