18 May, 2026 | 2:26 PM

అంకుసాపూర్‌లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

18-05-2026 01:25 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్ గ్రామంలో పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు సందె వేణి అంజయ్య, నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం సహాయ నిధి నిరుపేద కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తోందని నాయకులు పేర్కొన్నారు. లబ్ధిదారుల్లో రేగుల లచ్వవ్వ భర్త రాములకు రూ.17,000, బోటుకు ముత్తయ్యకు రూ.6,000 సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ప్రజారోగ్య పరిరక్షణే ప్రజా ప్రభుత్వం తొలి ప్రాధాన్యమని, అనారోగ్యంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. 

పేద ప్రజలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా వైద్యం చేయించుకునే అవకాశం సీఎం రేవంత్ రెడ్డి కల్పించారని లబ్ధిదారులు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రికార్డు స్థాయిలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేస్తున్నామని నాయకులు వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జలగం ప్రవీణ్  లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు సందె వేణి అంజయ్య, ఉపాధ్యక్షుడు రాజేశం, ప్రధాన కార్యదర్శి కంకణాల లక్ష్మణ్, బైరి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.