వెల్లులలో భూభారతి భూసర్వే
17-07-2026 06:14 PM
మెట్ పల్లి,(విజయక్రాంతి): మెట్ పల్లి మండలం వెల్లుల్ల, మసాయి గ్రామాలలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి–భూసర్వే అవగాహన కార్యక్రమంను స్థానిక సర్పంచ్ గూడూరు తిరుపతి ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ గూడూరు తిరుపతి మాట్లాడుతూ రైతులు భూసర్వే కార్యక్రమానికి పూర్తిగా సహకరించి, తమ భూముల హద్దులను ఖచ్చితంగా చూపించాలని కోరారు.
ఈ సర్వే ద్వారా భూ రికార్డులు పారదర్శకంగా రూపొందడంతో పాటు భవిష్యత్తులో భూ వివాదాలకు చెక్ పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెట్ పల్లి తాసిల్దార్ నీత,ఎడి సర్వేయర్ కిషన్,ఆర్ఐ సంధ్య రాణి, సర్వేయర్ గంగా నర్సయ్య, కార్యదర్శి నారాయణ, జిపిఓ రాజేశం, ఉప సర్పంచ్ శేఖర్, పాలకవర్గ సభ్యులు,రైతులు, ప్రజలు పాల్గొన్నారు.






