3 August, 2026 | 2:17 AM

6న డబుల్ బెడ్‌రూమ్‌ల పంపిణీ

03-09-2025 12:00 AM

గద్వాల, సెప్టెంబర్ 2 : పేద ప్రజల సొంతింటికల   ఈనెల 6వ తేదీన లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూం పంపిణి కల నెరవేరుతుందని నెరవేడుతుందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రం లోని తన ఛాంబర్ లో కలెక్టర్ సంతోష్ తో కలిసి ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి సంబందించిన అధికారులతో సమీక్ష సమావేశంను నిర్వహించారు. 

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  ఈనెల 6వ తేదీ న నాడు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి వర్యులు డబుల్ బెడ్ రూమ్ గృహాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చేయుచున్నందున, అన్ని హంగులతో ఏర్పాట్లను పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి బ్లాక్ లో నీరు, విద్యుత్తు సదుపాయాలతో పాటు పారిశుద్ధ్య పనులు చేపట్టి గృహాలను తోరణాలతో అందంగా అలంకరించాలన్నారు. 

పరిసర ప్రాంతాలలో పారిశుధ్య పనులును చేపట్టాలని, అన్ని గృహాలకు కలరింగ్ పనులు పూర్తి చేయాలన్నారు.  మంత్రి  వచ్చే మార్గంలో రోడ్లకు మరమ్మతు పనులను చేపట్టాలని సూచించారు.  రూ 85 కోట్లతో పరమాల శివారులో నిర్మించిన 1275 గృహాలలో 715 గృహాలను పూర్తిచేసి, ఎంపికైన లబ్ధిదారులకు మంత్రి చేతుల మీదగా పట్టాలను అందించేందుకు ఏర్పాట్లను పూర్తి చేయాలని  తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగరావు,  వివిధ శాఖల అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.