3 August, 2026 | 3:39 AM

మోదీతోనే జెన్

03-08-2026 02:16 AM

పార్లమెంట్ ఆవరణలో సనాతన ధర్నాన్ని కించపరిచేలా కాంగ్రెస్ చేష్టలు

బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్‌వి సుభాష్

హైదరాబాద్, ఆగస్టు 2 (విజయక్రాంతి): మోదీతోనే జెన్ ఉన్నారని, తాజా నివేదికల ప్రకారం 41 శాతం మంది జెన్ మోదీకి మద్దతు ఇస్తున్నారని, ఇండి కూటమికు 8.85 శాతమే మద్దతు ఉన్నదని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్‌వి సుభాష్ అన్నారు. కోటి మంది యువత రాజకీయాల్లో వచ్చేలా వారిని మోదీ ప్రోత్సహిస్తున్నారని చెప్పారు.

పేపర్ లీక్ బిల్లు అమల్లోకి వస్తే ప్రధాని మోదీ పాపులారిటీ ఇంకా పెరుగుతుందని భావించి కొన్ని పార్టీలు, కొందరు నాయకులు పార్లమెంట్‌లో వింత వింత చేష్టలు, కోతి చేష్టలు చేశారని, పార్లమెంట్ ఆవరణలో కూడా సనాతన ధర్మాన్ని కించపరిచేలా వారి చర్యలున్నాయని విమర్శించారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జంతర్‌మంతర్ వద్ద ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులను రెచ్చగొట్టే విధంగా కొన్ని పార్టీలు హైజాక్ చేశాయని ఆరోపించారు.

ఈ నిరసన కార్యక్రమంలో క్రిమినల్స్ కూడా పాల్గొన్నారని, మర్డర్, రాబరీ, రేప్ కేసులు ఎదుర్కొంటున్న దాదాపు 3 వేల మంది విద్యార్థుల ముసుగులో దేశబధ్రతను విధ్వంసం చేయాలని చూశారు. కాంగ్రెస్, ఆప్, సమాజ్‌వాదీ పార్టీ విద్యార్థులను రెచ్చగొట్టెలా వ్యాఖ్యలు చేశాయని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికలు జరిగాక 2024 తర్వాత చూస్తే సుమారు 60 శాతం మంది జెన్ ఎన్డీయే ప్రభుత్వానికి ఓటు వేశారని, ఇండి కూటమికి 28 శాతం, ఇతరులకు 10 శాతం వేశారన్నారు.