calender_icon.png 15 July, 2025 | 12:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్కూల్ విద్యార్థులకు ఉచిత హెల్త్ కార్డుల పంపిణీ

15-07-2025 12:00:00 AM

భూత్పూర్ జూలై 14 : మండల కేంద్రంలోని సాహితి హై స్కూల్ లో విద్యార్థులకు రవి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్. శేఖర్ ఉచిత హెల్త్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సోమవారం సాహితీ స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రవి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ శేఖర్ పాల్గొని వి ద్యార్థులకు హెల్త్ కార్డులను స్కూల్ కరస్పాండెంట్ సత్యం సమక్షంలో పంపిణీ చేశారు.

అనంత రం డాక్టర్ శేఖర్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు విద్య ఎంత అవసరమో ఆరోగ్యం కూడా అంతే అవసరమని అన్నారు. విద్యార్థులు అనారోగ్య సమయంలో ఆర్థికంగా ఇబ్బంది పడే వారికి ఈ హెల్త్ కార్డులు ఎంతో ఉపయోగంగా ఉంటాయన్నారు. ఆర్థిక భారాన్ని కొంతవరకు తగ్గించేందుకు ఇది ఆర్థిక భారాన్ని కొంతవరకు తగ్గించేందుకు హెల్త్ కార్డులు ఉపయోగపడతాయ న్నారు.

అదేవిధంగా స్కూల్ కరెస్పాండెంట్ సత్యం మాట్లాడుతూ స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా హెల్త్ కార్డులు పంపిణీ చేయడం తమకెంతో ఆనందంగా ఉందని, ప్రతి ఒక్కరూ కష్ట సమయంలో ఈ హెల్త్ కార్డు సేవలు వినియోగించుకోవాలని తెలియజేశారు. విద్యార్థులకు హెల్త్ కార్డులను పంపిణీ చేయడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ తో పాటు విద్యార్థిని విద్యార్థులు తదితరులుపాల్గొన్నారు.