calender_icon.png 15 July, 2025 | 5:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటరు జాబితాను తప్పులు దొర్లకుండా తయారు చేసే బాధ్యత బిఎల్ఓలదే

14-07-2025 11:24:51 PM

కుబీర్ తహసీల్దార్ శివరాజ్..

కుభీర్ (విజయక్రాంతి): ఓటరు జాబితాను తప్పులు దొర్లకుండా పారదర్శకంగా తయారు చేయాల్సిన బాధ్యత బిఎల్వోలదేనని తహసీల్దార్ శివరాజ్(Tehsildar Shivraj) సూచించారు. సోమవారం మండల కేంద్రం కుభీర్ లోని రైతు వేదికలో మండలంలోని ఆయా గ్రామాల బిఎల్వోలు సూపర్వైజర్లతో నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాస్టర్ ట్రైనర్స్ జిలకర రాజేశ్వర్, గంగాధర్ ఓటరు జాబితాలో తప్పుల సవరణ, ఎన్నికల విధులు, బాధ్యతలు, ఎన్నికలకు సంబంధించిన వివిధ అంశాలపై వారు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీటీలు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.