calender_icon.png 15 July, 2025 | 6:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

100 డయల్ వాహనాలకు జీపీఎస్ సేవలు

15-07-2025 12:00:00 AM

నిర్మల్, జూలై ౧౪ (విజయక్రాంతి): జిల్లా పోలీసింగ్‌లో పారదర్శకతను పెంపొందించడమే లక్ష్యంగా, ఎస్పీ డా.జి. జానకి షర్మిల ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లాలో నడుస్తున్న మొత్తం 100 డయల్ వాహనాలకు నూతన జీపీఎస్ పరికరాలను అమర్చారు. ఈ ఆధునిక టెక్నాలజీ సాయంతో, అత్యవసర పరిస్థి తులలో ఘటనాస్థలానికి పోలీసులు వేగం గా చేరుకోగలుగుతారు.

వాహనాల గమ్యం, చలనం, స్థితి వంటి సమాచారం రియల్ టైమ్లో జిల్లా కంట్రోల్ రూమ్కు అందుబాటులోకి వస్తుంది. ఇది రెస్పాన్స్ టైమును గణ నీయంగా తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ చర్య ప్రజలకు వేగవంతమైన, సమర్థవంతమైన సేవలు అందించేందుకు దోహదపడుతుందని అధికారులు తెలిపారు.