15 May, 2026 | 8:38 PM

హరిపురంలో ఉపాధి హామీ కూలీలకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ

15-05-2026 07:34 PM

ముత్తారం,(విజయక్రాంతి): ముత్తారం మండలంలోని హరిపురం గ్రామ పరిధిలో గల అడవి ప్రాంతంలో కందకాలు తవ్వుతున్న ఉపాధి హామీ కూలీలకు శుక్రవారం ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా కూలీలు వడదెబ్బకు గురికాకుండా ఉండాలనే ఉద్దేశంతో గ్రామ సర్పంచ్ మెంగని సమత తిరుపతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. వార్డు సభ్యులు  ఏజ్జ లత, తిరుపతి, చేనవేన సాయి కుమార్, యార సునీత రాజిరెడ్డి, బండారి రవీందర్,  ఏఎన్ఎం కళావతి, ఆశ వర్కర్ జ్యోత్స్న.  ఉపాధి హామీ మేట్ రమేష్ తో పాటు కూలీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, ఎండలు తీవ్రంగా ఉన్నందున కూలీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పని ప్రదేశంలో నీడను ఏర్పాటు చేసుకోవాలని, నీరు ఎక్కువగా తాగుతూ ఆరోగ్యంగా ఉండాలని కోరారు. ఆరోగ్య సిబ్బంది కూలీలకు వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన ప్రాథమిక జాగ్రత్తల గురించి వివరించారు.