15 May, 2026 | 8:36 PM

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం

15-05-2026 07:40 PM

- అదనపు డీసీపీ కుషాల్కర్

 - శనిగరంలో సీసీ కెమెరాలు ప్రారంభం

కోహెడ: నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం అని అదనపు డీసీపీ కుషాల్కర్ అన్నారు. శుక్రవారం శనిగరంలో 30 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సురక్ష నేత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు డీసీపీ కుషాల్కర్ హాజరైయి సీసీ కెమెరాల ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అధునిక సాంకేతికతను కలిగిన సీసీ కెమెరాలను గ్రామంలోని ప్రధాన కూడళ్లు బస్‌స్టేషన్‌, గ్రామం ఎంట్రీ, ఎగ్జిట్‌లలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

హుస్నాబాద్ నియోజకవర్గంలోని సిద్దిపేట జిల్లా, రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి నిషేధిత గంజాయి, రేషన్‌ బియ్యం అక్రమ రవాణా జరగకుండా నియంత్రించేందుకు అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. కోహెడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు ముందుకు రావాలని, గ్రామాల్లో విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.  స్వీయ రక్షణ కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. యువత అసాంఘిక కార్యాకలాపాలకు దూరంగా ఉండాలని, గంజాయికి అలవాటు పడి బంగారు భవిష్యత్‌ నాశనం చేసుకోవద్దని అన్నారు.

వారిని సక్రమమైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. మహిళలకు, బాలికలకు ఏమైనా ఇబ్బందులు తలేత్తితే డయల్‌ 100, షీటీమ్‌కు సంప్రదించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ విధిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల ప్రాధాన్యత చాలా కీలకంగా మారుతుందని చెప్పారు.  అనుమనాస్పద వ్యక్తుల కదలికలను గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడుతాయని అన్నారు.

గ్రామంలోని  సీసీ కెమెరాలను ఏర్పాటుకు సహకరించిన వైట్ ఫీల్ట్ బయో ప్రొడక్ట్ ప్రై.లీ. గ్రీన్వేస్ బయో ఎనర్జీ ప్రై.లీ. కంపెనీ ప్రతినిధులను అభినందించారు. ఈ సీసీ కెమెరా ఏర్పాటులో  మండల, గ్రామాల్లో ప్రజలు, వ్యాపారులు, యువత సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో  హుస్నాబాద్ సి ఐ శ్రీను, కోహెడ ఎస్ఐ, ఎస్సై అభిలాష్, గ్రామ సర్పంచ్ లింగంపల్లి లక్ష్మయ్య, ఉప సర్పంచ్ పెరుక బుచ్చయ్య, వార్డు సభ్యులు, సీనియర్ నాయకులు, మహళలు పోలీస్ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు...