24 August, 2026 | 6:30 PM

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

24-08-2026 05:22 PM

కోనరావుపేట, ఆగస్టు 24 (విజయక్రాంతి): కోనరావుపేటలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.సర్పంచ్ మాస్కూరి కాశీరం,జిపిఓ దిలీప్, పంచాయతీ కార్యదర్శి సాయి, వార్డు సభ్యులు కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు